ఆయన ఆరోగ్యం బాగోలేదని... ఎంతో ఏడ్చానని.. తను తన జీవితంలో నుంచి వెళ్లిపోయాక చాలా బాధపడ్డాను. ఆ దేవుడు ఒక రోజు, ఒక గంట నా భర్తతో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండని కోరుకుంటున్నాను. కనీసం కలలో అయినా కనపడితే మాట్లాడాలని ఉంది. భర్త చనిపోయాక చాలా కాలం తాను డిప్రెషన్లోకి వెళ్లినట్లు అప్పుడు తన కూతురు తనకు అండగా నిలిచిందని చెప్పుకొచ్చింది.
రెండో పెళ్లి, రిలేషన్షిప్ లాంటి ఆలోచనలు కూడా తనకూ ఏమీ లేవని అసలు రిలేషన్షిప్ అంటేనే భయమేస్తుందని, వాటిపై నమ్మకం లేదని కూడా చెప్పింది. డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు నెల రోజుల పాటు తిండి తినలేదని గుర్తు చేసుకుంది. ఎవరికి నచ్చినట్లు వారు దుస్తులు ధరించవచ్చునని తెలిపింది.