కాగా, పల్నాడు జిల్లా నరసరావుపేటలో హీరో సూర్య పుట్టిన రోజైన ఆదివారం ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని కోటప్పకొండ యక్కాలవారిపాళెంకు చెందిన నక్కా వెంకటేశ్ (19), పోలూరి శేషులు (20)గా గుర్తించారు. వీరిద్దరూ ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతానికిగురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.
ఈ నేపథ్యంలో హీరో సూర్య మృతుల కుటుంబ సభ్యులతో ఫోనులో మాట్లాడారు. ఈ మేరకు మీడియో కాల్ చేసి వారిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలన్నా తప్పకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. మృతుడి సోదరి తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం ఇప్పించాలని కోరగా, తప్పకుండా ఆమె బాధ్యతలు తీసుకుంటానని సూర్య హామీ ఇచ్చారు.