ఈ సందర్భంగా అతిథి బోయపాటి శ్రీను మాట్లాడుతూ, రామ్ లక్ష్మణ్ ఫైట్సే కాదు మాటలు కూడా బాగా చెబుతారని ఈ స్టేజీమీద మాటలబట్టి అర్థమైంది. సూర్యగారు ఛారిటీ ద్వారా గుండెజబ్బు వున్నవారికి హృదయపూర్వకంగా సాయం చేస్తున్నారు. ఈ ఛారిటీ వల్ల సూర్యగారి జనరేషన్ అంతా బాగుంటారు. ఈ ఛారిటీ అనేది తెలుగులోనూ కేన్సర్ ఆసుపత్రి ద్వారా బాలయ్యబాబు, మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌తోనూ సేవలు చేస్తున్నారు. సూర్యలాంటి మంచి మనసు వున్నవారు మనకు చాలా అవసరం.
తెలుగు ప్రేక్షకులకు బాషతో సంబంధంలేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారు. సూర్య సినిమా మన సినిమా అని ఫీలవుతారు. రజనీకాంత్ తర్వాత సూర్య అంటే మనవాడు అని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. అలాంటి సూర్యగారి నుంచి వస్తున్న ఇ.టి. సినిమా ప్రేక్షకులు ఆదరించే సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. ఆకాశమే నీ హద్దురా, జైభీమ్ వంటి సినిమాలను బయోపిక్‌లుగా చేసి అద్భుతంగా పండించారు. నా టైం కుదిరినప్పుడు సూర్యగారికి సమయం చిక్కినప్పుడు తప్పకుండా సినిమా చేస్తాను.. అఖండ, పుష్ప, భీమ్లానాయక్ తో తెలుగు సినిమా నిండుకుండలా వుంది. అందులో ఇ.టి. కూడా వుండాలని కోరుకుంటున్నాను అన్నారు.