అయితే తాజాగా తమన్నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథను .. పాత్రను తమన్నాకి చెప్పడం, ఆమె అంగీకరించడం జరిగిపోయాయని సినీ జనం అంటున్నారు. దీంతో శ్రియను పక్కనబెట్టి తమన్నాను ఎంపిక చేశారని టాక్ వస్తోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలో బాలకృష్ణ చేసిన ఫ్యాక్షన్ సినిమాలు భారీ విజయాలను సాధించడం వలన, ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.