తిరువళ్లూరు మహిళా ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును చెన్నైకి బదిలీ చేయాలని, కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాలని చిత్ర తండ్రి కామరాజ్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినా.. విచారణలో పురోగతి లేదని చిత్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే హేమ్‌నాథ్ కేసును జాప్యం చేయాలంటూ 2021 నుంచి పలు పిటిషన్లు వేస్తున్నారని పిటిషన్‌లో చిత్ర తండ్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు ఛార్జిషీటు నమోదు చేసే దశలో ఉంది. అంతే కాకుండా వయోభారం కారణంగా కేసు విచారణ నిమిత్తం తిరువళ్లూరు వెళ్లడం కష్టమని, అందుకే కేసును తిరువళ్లూరు నుంచి చెన్నైకి బదిలీ చేయాలని అభ్యర్థించారు.