Nandyala: బాలికపై అత్యాచారం చేసిన బాబాయ్.. తండ్రిలా చూసుకోవాల్సిన వాడు..?

సెల్వి

శనివారం, 2 ఆగస్టు 2025 (11:42 IST)
సమాజంలో నైతిక విలువలు పోతున్నాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా వావి వరసలు మరచి ప్రవర్తిస్తున్నారు. పశువుల్లాగా మారి బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలను నవ్వులపాలు చేస్తున్నారు. తమ వెకిలి చేష్టలతో సమాజానికి తల వంపులు తెస్తున్నారు. 
 
కామంతో చేయకూడని తప్పులు చేస్తున్నారు. తాజాగా సమాజం తలదించుకునేలాంటి ఘటన ఒకటి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందులూరులో జరిగింది.
 
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందులూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికపై బాబాయ్ వరసైనా ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యులకు బాధితురాలైన బాలిక తెలపడంతో నింధితుడి బాగోతం బయటపడింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు