ఢిల్లీలోని రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అసలు కారణం వెలుగులోకి వచ్చింది. మహా కుంభమేళా కారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో, ఫిబ్రవరి 15న రాత్రి 8:48 గంటలకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి-3పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్లాట్‌ఫారమ్ నంబర్ 14, 15లను కలుపుతుంది. చాలా మంది ప్రయాణికులు తమ తలలపై భారీ లగేజీని మోసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో, ఒక ప్రయాణికుడు తలపై మోస్తున్న ఒక పెద్ద బ్యాగ్ జారి కిందపడింది.
దీంతో పై మెట్లపై ఉన్న ప్రయాణికులు కింది మెట్లపై ఉన్న వారిని నెట్టుకున్నారు. ఇది డొమినో ప్రభావంలా పనిచేసి, మెట్లపై ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ తొక్కిసలాటలో 18 మంది చనిపోగా, 15 మంది గాయపడ్డారు.