అన్నయ్య అంటూ ఫ్రెండ్ శ్రవణ్‌తో చనువుగా ఉన్న పావని.. టీవీ నటుడు ప్రదీప్ సూసైడ్‌ కేసులో మలుపు

బుధవారం, 3 మే 2017 (15:40 IST)
తెలుగు బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు చెలరేగుతున్నాయి. ప్రదీప్ భార్య పావని రెడ్డికి శ్రవణ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఈయన నాలుగు నెలల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. ప్రదీప్ ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో శ్రవణ్‌తో పావని అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. ఇది ఏమాత్రం నచ్చని ప్రదీప్... భార్యను ఖండించగా, ఆమె పెద్దగా పట్టించుకోలేదట. పైగా, పావని తన ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకుంది. ఈ పిక్చర్ ప్రదీప్‌కు ఏమాత్రం నచ్చలేదు. దీనిపై బుధవారం వేకువజామున 4 గంటల వరకు గొడవపడినట్టు సమాచారం. అంతకుముందు.. తన ఇంట్లోనే శ్రవణ్ బర్త్‌డేను పావని, ప్రదీప్‌లు నిర్వహించినట్టు సమాచారం. ఆ తర్వాత భార్యతో గొడవపడిన ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
తన భర్త ఆత్మహత్యపై పావని రెడ్డి స్పందిస్తూ తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చామన్నారు. ఆయన ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకోవడం షాక్‌కు గురి చేసిందన్నారు. తనపైనాగానీ, ఆయనపైనగానీ ఎలాంటి సందేహాలు లేవన్నారు. మంగళవారం రాత్రి అన్నయ్య శ్రవణ్ బర్త్‌డే వేడుకలను ఇంట్లోనే జరుపుకున్నామనీ, ఈ వేడుకల్లో కూడా ప్రదీప్ పాల్గొని కొద్దిగా ఆల్కహాల్ కూడా తీసుకున్నాడని చెప్పాడు. పైగా, తన స్నేహితుడు శ్రవణ్ తన భర్త అనుమతితోనే ఇంట్లో ఉంటూ వచ్చాడని ఆమె తెలిపారు. 
 
కాగా, హైదరాబాద్ పుప్పాలగూడ ఆల్కాపురం కాలనీ గ్రీన్ హోం అపార్ట్ మెంట్‌లో ప్రదీప్ నివాసం ఉంటున్నాడు. ఉదయం 4 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ప్రదీప్ సప్తమాత్రిక సీరియల్‌లో హీరోగా నటించారు. ఆయన భార్య పావని రెడ్డి కూడా బుల్లితెర నటిగా కొనసాగుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి