ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా విడుదల ఎప్పుడు? షూటింగ్ అయిందా లేదా? అనేది సోషల్ మీడియాలోనూ, చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ అభిమానులకు శుభ వార్త తెలిపారు. ది రాజా సాబ్ షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందనీ, సంక్రాతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నామని వెల్లడించారు.