సెప్టెంబరు నుంచి రిజిస్టర్ పోస్ట్ సేవలకు స్వస్తి : తపాలా శాఖ నిర్ణయం

ఠాగూర్

గురువారం, 7 ఆగస్టు 2025 (08:50 IST)
భారత తపాలా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి రిజిస్టర్ పోస్ట్ సేవలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. నిజానికి ఈ సేవలు కొన్ని దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, టీచర్లు, లాయర్లు, ఉద్యోగులు, ఉద్యోగార్థులు, విద్యార్థులు, గ్రామీణ ప్రజలతో 50 యేళ్ళకు పైగా ఈ సేవలు అనుబంధం కలిగివున్నాయి. ఈ సేవలను సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, ఈ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్టులో విలీనం చేయనున్నారు. ఫలితంగా అత్యంత చౌకకగా, విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న నిలిచిన ఈ సేవలకు త్వరలోనే స్వస్తి చెప్పనున్నారు. ఇకపై రిజిస్టర్ పోస్ట్ తరహా ఫీచర్లు కలిగిన సర్వీసును ఇంకో పేరుతో స్పీడ్ పోస్టును అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
ప్రస్తుతం తపాలా సర్వీసుల కోసం స్పీడ్ పోస్ట్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని భారత తంతి తపాలా శాఖ నిర్వహిస్తోంది. పోస్ట్‌ను డెలివరీ చేసినట్టుగా ధృవీకరణ, పోస్ట్ ట్రాకింగ్, అడ్రస్ ప్రకారం ఖచ్చితత్వంతో పోస్ట్ డెలివరీ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీసులోని ప్రధాన ఫీచర్లు. వీటిని కలిగిన తపాలా సర్వీసును ప్రస్తుతం స్పీడ్ పోస్ట్ కూడా అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్పీడ్ పోస్ట్‌ను కొనసాగించడం అనవసరమని భావించిన తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు