ఇటీవలే లావణ్య త్రిపాఠి పెండ్లి విషయంలో చాలా ఆసక్తికర వార్తలు వచ్చాయి. రెండు రోజుల్లో పెండ్లి అయిపోతుందంటూ వార్తలు వినిపించాయి. అయితే దీనిపై లావణ్య త్రిపాఠి ఇలా స్పందించింది. `నిజంగా నా పెళ్లి గురించి అంత జరిగిందా.. నాకు తెలీదే. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచన లేదు. నా చేతికి ఉన్న రింగ్ ఎవరూ తొడగలేదని, నేనే కొనుక్కున్నానని` చూపించింది.