ఈ సందర్భంగా సంధ్యారాజ్ మాట్లాడుతూ, ఈ సినిమా ఏడాదిపాటు ప్రమోషన్ చేశాం. ప్రజలకు మన సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణమైన సినిమా వస్తుందని చెప్పాను. మా కుటుంబంతోపాటు చాలామంది స్టార్లు బిజినెస్, డాన్స్ రంగంలో వున్న మీరు ఎందుకు సినిమా తీశారని అని అడిగారు. అప్పుడు చెప్పినా ఎవ్వరికీ సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు ఫెస్టివల్‌లో ఎంపికవ్వడమే అందరికీ జవాబు దొరికింది అనుకుంటున్నా. మన కూచిపూడి డాన్స్ అంతర్జాతీయ స్థాయిలో అందరికీ చేరువవ్వాలనే కోరిక తీరింది. నాకు గర్వంగా వుందని తెలిపారు.
నాకు గర్వంగా వుందిః రేవంత్
చిత్ర దర్శకుడు రేవత్ మాట్లాడుతూ, ఒకే ఒక తెలుగు సినిమా నాట్యం ఇండియన్ పనోరమాలో గోవా ఫెస్టివల్‌లో ఎంపికైంది. ఈ సందర్భంగా ఇన్‌ఫర్‌మేషన్ బ్రాండ్ కాస్టింగ్ వారికి ధన్యవాదాలు. జాతీయస్థాయిలో పలు భాషల్లో సినిమాలు వచ్చినా జ్యూరీని మెప్పించడం గర్వంగా వుంది అని తెలిపారు.