డా. రాజశేఖర్ నటించిన `పి.ఎస్.వి.గరుడవేగ` బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పవర్‌ఫుల్ రోల్స్‌తో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న కథానాయకుడు డా.రాజశేఖర్ హీరోగా.. `అ` వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన విలక్షణ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రూపొందనున్న `కల్కి` చిత్రానికి సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్‌ను ఆల్ రెడీ విడుదల చేశారు.
శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. ఈ చిత్రంలో ఆదాశర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా సందడి చేయనున్నారు.