తనను ఐటమ్ అన్నాడంటూ నటి ఫిర్యాదు.. (video)

గురువారం, 27 అక్టోబరు 2022 (17:04 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో యువ నటీనటుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. నటుడు అభినవ్ గోమటం తనను ఐటమ్ అన్నాడని ఇటీవల అవార్డు అందుకున్న కల్పిత గణేశ్ ఆరోపించారు. అయితే, వీటిని గణేశ్ తోసిపుచ్చాడు. ఉద్దేశ్యపూర్వకంగానే తనను టార్గెట్ చేసిందంటూ మండిపడ్డారు. 
 
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంలో సమంతకు అక్కగా నటించిన కల్పిక గణేశ్ టాలీవుడ్‌లో యువ కమెడియన్ అభినవ్ గోమటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కల్పిక గణేశ్ ఓ కార్యక్రమంలో ఉత్తమ సహాయ నటి అవార్డును కూడా అందుకున్నారు. 
 
అయితే, తనను అభినవ్ ఐటెమ్ అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించారని కల్పిక ఆరోపించింది. అంతేకాకుండా, అభినవ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇదే అంశంపై ఆమె తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ కె.కవితను ట్యాగ్ చేస్తూ ఆమె ఆరోపణలు చేయడం గమనార్హం. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు