తెలుగు, తమిళంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓ ప్రముఖనటికి ఎయిర్‌పోర్టు అధికారులు చుక్కలు చూపించారు. ఆ వివరాలను పరిశీలిస్తే....ఈ హీరోయిన్ ఇటీవల విదేశాలకు వెళ్లి తిరిగి ఇండియాకు వస్తున్న సమయంలో ముంబై ఎయిర్ పోర్టుకి చేరుకుంది. అదే సమయంలో ఎయిర్ పోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు. వరుసగా తనిఖీలు చేపడుతుండడంతో ఈ భామ వంతురానే వచ్చింది.
అయితే ఈ భామ మాత్రం తన లగేజీని చెక్ చేయడానికి ఒప్పుకోలేదట. కానీ ఎయిర్ పోర్ట్ అధికారులు బలవంతంగా ఆ భామ దగ్గర ఉన్న బ్యాగ్ తీసి చూసి నివ్వెరపోయారట. ఇంతకీ లోపల ఏముందో తెలుసా.... సెక్స్ టాయ్. ఎయిర్ పోర్టులో అందరిముందు అధికారులు టాయ్‌ని బయట తీసేసరికి ఈ భామకు ఏం చేయాలో అర్ధం కాలేదట. కొద్దిసేపటి తరువాత తేరుకుని తన వస్తువులను సర్దుకుని హైదరాబాద్‌కి వచ్చేసిందట. అదీ సంగతి. ఐతే తన పేరును చెప్పవద్దని ఆ ఎయిర్ పోర్టు అధికారుల వద్ద బ్రతిమాలుకున్నదట.