బుల్లితెర అని అంత ఈజీగా తీసేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ పుణ్యమా అని బుల్లితెర (టి.వి)లకు బాగా ప్రాధాన్యత పెరిగిపోయింది. టివిలో వచ్చే అన్ని కార్యక్రమాలు మొబైల్ ఫోన్లలో దర్శనం ఇవ్వడంతో టివి కార్యక్రమాలన్నీ ఫోన్లోనే చూసేస్తున్నారు. ఇదిలావుంటే టివి కార్యక్రమాలకు పాపులారిటీ పెరుగుతుందంటే అందులో నటించే నటీనటులకు కూడా పిచ్చ క్రేజ్ వచ్చేస్తుంది. సినిమా వాళ్లతో సమానంగా అభిమానులను సొంతం చేసుకుంటున్నారు టివి నటులు.
కాస్త అందచందాలు ఉన్న వారు బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రమోట్ అయిపోతున్నారు. సీనియర్ యాంకర్లు ఝాన్సీ మొదలు ప్రస్తుతం లీడ్‌లో ఉన్న అనసూయ, రేష్మి, లాస్య, శ్యామలతో పాటు రవి, ప్రదీప్ ఇలా అనేక మంది అలా వచ్చిన వారే. వీరి సంగతి అటుంచితే పెద్ద లాగు, డొల్లా చొక్కా, తింగరి తింగరి మాటలతో డిఫరెంట్ యాటిట్యూడ్‌తో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు బిత్తిరి సత్తి. పల్లెలు, పట్టణాలలో సైతం అతను తెలియని, అతని ప్రోగ్రామ్ చూడనివారంటూ ఎవరూ ఉండరు. తీన్మార్ వార్తల్లో ప్రతిరోజు జరిగే బర్నింగ్ టాపిక్‌ని తీసుకుని తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో పంచ్‌లు విసురుతూ పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు బిత్తిరి సత్తి.
అయితే మొదట్లో ఛానల్ ఉద్యోగం దొరికితే చాలు అనుకున్న బిత్తిరి సత్తి తన ప్రోగ్రామ్ ద్వారా ఛానల్‌కి కాసుల వర్షం కురిపిండంతో బిత్తిరిసత్తికి భారాగానే ముట్టజెబుతున్నారట ఆ ఛానల్ యాజమాన్యం. నెలకు అతని జీతం లక్షా ముప్పైవేల రూపాయలు. మొత్తానికి ఈ బిత్తిరోడు ఏం తక్కువోడు కాదు మాట ప్రతినెలా లక్షాధికారే ఇంతకీ బిత్తిరి సత్తి అసలు పేరు చెప్పలేదు కదూ అతని పేరు చేవెళ్ళ రవి అలియాస్ సత్తి బిత్తిరి సత్తి.