''సర్దార్ గబ్బర్ సింగ్'' సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లా నేను డ్యాన్సులు చేయలేనని పవన్ కల్యాణ్ చెప్పాడు. ఈ డ్యాన్స్‌పై పవన్ కామెంట్సే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కోపం తెప్పించాయని టాలీవుడ్ వర్గాల సమాచారం.
అయితే వీరిద్దరి గొడవపై ఫ్యాన్స్ లైకులు, పోస్టులతో అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మొన్నటి వరకు కామ్‌గా ఉన్న పవన్ ఫాన్స్ ఒక్క సారిగా బన్నీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. వారికి వచ్చిన డైలాగ్స్‌తో బన్నీపై సెటైర్లు వేస్తూ రచ్చ చేస్తున్నారు. అదే స్థాయిలో బన్నీని సప్పోర్ట్ చేస్తూ అల్లు అభిమానులు కూడా రంగంలోకి దిగారు.