పూజాతో కలిసి రెండు సినిమాల్లో నటించాడు వరుణ్. ఒకటి ముకుంద, ఆ తరువాత ప్రస్తుతం గద్దలకొండ గణేష్. ఈ రెండు సినిమాలకే వరుణ్ పూజాతో రొమాంటిక్ టచ్‌కు కనెక్ట్ అయిపోయాడు. అందుకే డేటింగ్ అంటే ఒక్క పూజాతోనే చేస్తానంటున్నాడు. ఫిదా సినిమాతో సాయిపల్లవితో ప్రేమను పెంచేసుకున్నాడు ఈ ఆరడుగుల యువ హీరో. పెళ్ళంటే చేసుకుంటే ఆమెనే చేసుకుంటానంటూ చెబుతున్నాడు. ఐతే... సినిమా హీరోలను ఇలాంటి ప్రశ్నలు వేస్తే అలాంటి సమాధానాలే వస్తాయి మరి.