విదేశాల్లో పెర్ఫామ్ చేస్తున్న నితిన్‌ను చూసి నభా నటేశ్ ఆశ్చర్యపోవడంతో ఈ పాట ప్రారంభం అవుతుంది. ఈ సాంగ్‌ను గోవా బ్యాక్‌డ్రాప్‌లో నితిన్, నభాల మధ్య ఉండే అందమైన ప్రేమకథను చూడొచ్చు. ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన విషయాలను ఈ పాట రివీల్ చేస్తుంది. అలాగే తమన్నా భాటియాతో సహా సినిమాలో నటించిన ప్రధాన తారాగణం జిషుసేన్ గుప్తా, మంగ్లీలను కూడా పాటలో చూడొచ్చు.
మహతి స్వర సాగర్‌నుంచి విడుదలైన మరో చార్ట్ బస్టర్ నెంబర్ ఇది. కచ్చితంగా పాటలను ఇష్టపడేవారికి నచ్చేలా ఉందీ పాట. శ్రీజో, కృష్ణ చైతన్య ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి 'మాస్ట్రో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.