బాలీవుడ్ సీనియర్ నటుడు దిన్యర్ కాంట్రాక్టర్ ఇకలేరు. ఆయన బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 79 యేళ్లు. వయోభారంతో పాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన బుధవారం కన్నుమూసినట్టు తెలిపారు. ఈయన 'బాద్‌షా', 'కిలాడి' వంటి సినిమాల్లో తనదైన హాస్యంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
2001లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ చోరీ చోరీ చుప్‌కే చుప్‌కేలో హోటల్ మేనేజర్‌గా, అక్షయ్ కుమార్ మూవీ కిలాడీలో ప్రిన్సిపల్ పాత్రలో, షారుక్ ఖాన్ నటించిన బాద్‌షాలో క్యాసినో మేనేజర్‌గా వేసిన పాత్రలు దిన్‌యర్‌కు బాగా ప్రాచుర్యం కల్పించాయి. గుజరాత్, హిందీ నాటక రంగంతో అనుబంధం కలవాడు. ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
కాగా, దిన్యర్ కాంట్రాక్టర్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసి, ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈయన పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు.