ఈ నేపథ్యంలో రంజీత్ తనపై దాడి చేసిందని భర్త రాజ్‌సమంద్ మహారాష్ట్రలోని పూణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ సాయంతో భార్యపై ఫిర్యాదు చేశారు. తన భార్య రంజీత్ కౌర్, కుమారుడు ఇద్దరూ కలిసి తనను కొడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే వారిద్దరూ తనను నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసి హత్య చేసేందుకు ప్లాన్ చేసిందని ఆరోపించాడు. కాగా ఈ ఉదంతంపై రంజీత్ మాట్లాడుతూ అందరి ఇళ్లలో ఇలాంటి గొడవలు సహజమేనని, తన భర్త, కుమారుడు అమెరికాలో వ్యాపారం చేస్తున్నారని, ఈ విషయంలోనే వివాదం జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకుని భార్యభార్తలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగిందని తెలుస్తోంది.