ఈ విషయమై బాలీవుడ్‌లో థియేటర్లు వున్న ప్రముఖ ఎగ్జిబిటర్ మనోజ్ దేశాయ్, విజయ్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయన నడవడిక మార్చుకోవాలనీ, అసలు లైగర్ సినిమాకు విజయ్ దేవరకొండ ప్రధాన మైనస్ అంటూ విశ్లేషించాడు. ఆ తర్వాత సినిమా చూశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నిన్న ముంబై వెళ్ళి మనోజ్ దేశాయ్‌కు కలిసి ఆయనకు పాదాభివందనం చేశారు.
అనంతరం ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తాను మొదటినుంచి ఎలా వుంటానో, నా నైజం ఏమిటో, నేను అన్న మాటలు ఎలా వక్రీకరించబడ్డాయో మనోజ్‌కు విజయ్ వివరించారు. పిదప మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ, విజయ్ నిజంగా చాలా మంచి వ్యక్తి, డౌన్ టు ఎర్త్, నేను అతనిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. నేను అతని చిత్రాలన్నీ చూస్తానని వాగ్దానం చేస్తున్నాను. నేను అతనికి అన్ని శుభాలను కోరుకుంటున్నాను” అంటూ ఆశీర్వదించారు. నేను ఇద్దరికి క్షమాపణ కోరుతున్నా.
గతంలో ఖుదాగవా సినిమా టైంలో అమితాబ్‌కు క్షమాపణ చెప్పాను. ఇప్పుడు లైగర్ ద్వారా విజయ్‌కు క్షమాపణ చెబుతున్నానంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ్.. మనోజ్ ఆప్యాయంగా కౌగలించుకున్నారు. సో. విజయ్.. మంచితనం సోషల్ మీడియాలో మరో రకంగా రాయడం పట్ల ఆయన అభిమానులు చాలా మదనపడ్డారని తెలుస్తోంది. దీనితో విజయ్ దేవరకొండ ఇష్యూ సద్దు మణిగిందని బాలీవుడ్ మీడియా తెలియజేస్తుంది.