మణిరత్నం సినిమా నుండి విజయ్ సేతుపతి అవుట్... కారణమేంటో తెలుసా?

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (14:00 IST)
దక్షిణాదిలో అనతికాలంలోనే వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకున్న హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఈ నటుడు "పిజ్జా" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన నటించిన 'సూపర్ డీలక్స్' చిత్రం ఇటీవల విడదలై భారీ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. మణిరత్నం తీయబోతున్న సినిమాలో మొదట విజయ్ సేతుపతిని అనుకుని ఇప్పుడు తీసేసారనే వార్త వైరల్ అవుతోంది.
 
ఇప్పటికే మణిరత్నం డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి "నవాబు" సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి తన నటనతో మెప్పించాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో "పన్నియిన్ సెల్వన్" అనే చిత్రాన్ని ప్లాన్ చేసి, ఆ సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదించారట. 
 
ప్రీప్రొడక్షన్ స్థాయిలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు జాబితా నుంచి విజయ్ సేతుపతిని తొలగించడం చర్చనీయాంశమైంది. విజయ్ సేతుపతి బిజీ షెడ్యూల్ కారణంగా మణిరత్నం అడిగినట్లు ఈ సినిమా కోసం 200 రోజుల డేట్స్‌ను కేటాయించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట. 'సూపర్ డీలక్స్' సినిమాలో ట్రాన్స్‌జెండర్‌గా నటించిన విజయ్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు