ఈ నెల 19, 20 తేదీల మధ్య రాత్రి సమయంలో ముఖేష్ ఠాకూర్, మృతుడు జతిన్ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత జతిన్ తన భార్య సుధతో అసభ్యకరమైన స్థితిలో ఉండగా ముఖేశ్ చూశాడని పోలీసులు వెల్లడించారు. మరుసటి రోజు ఉదయం సుధ రోషనాలాలోని ఓ బొమ్మల ఫ్యాక్టరీకి పనికి వెళ్లిన తర్వాత ముఖేష్, జతిన్‌ల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ముఖేష్, ఇంట్లోని చిన్న గ్యాస్ సిలిండర్‌ను తీసుకుని జతిన్ తలపై పలుమార్లు బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతుడు జతిన్ ముఖేష్ భార్య సుధకు తెలిసిన వ్యక్తి ద్వారా వారి ఇంట్లో అద్దెకు దిగాడు.