Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

ఐవీఆర్

మంగళవారం, 24 డిశెంబరు 2024 (23:18 IST)
సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు అల్లు అర్జున్ (Allu Arjun) రాక మునుపే... అంటే 20 నిమిషాల ముందే థియేటర్ లోపల తొక్కిసలాట జరుగగా శ్రీ తేజ్ పడిపోయినట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం తొక్కిసలాట హాలు లోపలే జరుగగా, శ్రీతేజ్‌ను రాత్రి 9:16 నిమిషాలకు కొందరు యువకులు బయటకు తీసుకుని వచ్చారు.
 
 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ సమయంలో అంటే.. రాత్రి 9:28 నుంచి 9:34 వరకూ అల్లు అర్జున్ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద వున్నట్లు తెలుస్తోంది. కనుక అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు రాక మునుపే దుర్ఘటన జరిగిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. 
 

సంధ్య థియేటర్ ఘటనలో సంచలన వాస్తవాలు

అల్లు అర్జున్ థియేటర్ లోపలికి రావడానికి 20 నిమిషాల ముందే సంధ్య థియేటర్ లోపల తొక్కిసలాటలో స్పృహ తప్పి పడిపోయిన శ్రీ తేజ్

సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం థియేటర్ లోపల తొక్కిసలాట జరగగా రాత్రి 9:16 గంటల సమయంలో స్పృహ తప్పి పడిపోయిన శ్రీ తేజ్ ను బయటకి… pic.twitter.com/gpxHN05Nn3

— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024
ఐతే అల్లు అర్జున్ వస్తున్నాడన్న సమాచారంతో థియేటర్ లోపల వున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా బైటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నం వల్ల కూడా ఇలా జరిగి వుండొచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియో ఫుటేజ్ వాస్తవం అయితే పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర దుమారం చెలరేగక మానదు. ఏం జరుగుతుందో చూడాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు