హీరో అవ్వాల‌నుకున్న‌ప్పుడు అవ్వ‌లేక‌పోయాః కృష్ణుడు

గురువారం, 15 జులై 2021 (16:49 IST)
Krishnudu
వెండితెర‌పై హీరో అవ్వాల‌ని సినిమారంగంలోకి ప్ర‌వేశించిన కృష్ణుడు త‌ను ఊహించిన‌ప్పుడు హీరో అవ్వ‌లేక‌పోయాను. కానీ ఊహించ‌న‌ప్పుడు అనుకోకుండా హీరో అయిపోయాను అంటూ తెలియ‌జేస్తున్నారు. ఆయ‌న సినిమారంగంలోకి వ‌చ్చి 20 ఏళ్ళు అయింది. నేడు అన‌గా జూలై 15న ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ ఫొటోలో క‌నిపిస్తుంది ఆయ‌నే. కాలేజీ చ‌దివేట‌ప్పుడు ఆయ‌న ఫొటో ఇది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో చిట్‌చాట్‌.
 
మామూలుగా పుట్టిన‌రోజును ఎక్క‌డ జ‌రుపుకుంటారు?
పెద్ద‌గా జ‌రుపుకోను. చిన్న చిన్న అనాథ‌శ్ర‌మాల‌కు ఫుడ్ పేకెట్ ఇస్తుంటాను. సికింద్రాబాద్ స్టేష‌న్‌లో కొంద‌రికి పంచిపెడ‌తాను. సాధార‌ణ‌లైఫ్ నాది.
క‌రోనా పేండ‌మిక్ టైంలో ఏమైనా కార్య‌క్ర‌మాలు చేశారా?
చేయ‌లేక‌పోయాను. ఎందుకంటే నా కుటుంబం చాలా స‌ఫ‌ర్ అయింది. నా భార్య‌కు క‌రోనా టైంలో బాగోలేదు. అందుకే చేయ‌లేక‌పోయా.
మీరు ఏమ‌వ్వాల‌ని ఈ రంగంలోకి వ‌చ్చారు?
వెండితెర‌పై హీరో అవ్వాల‌నే వ‌చ్చాను. ఊహించిన‌ప్పుడు అవ్వ‌లేదు. ఊహించ‌న‌ప్పుడు అయ్యాను. లావు అయ్యాక అనుకోకుండా హీరో అయ్యా.
బాగా లావుగా వున్న మీరు న‌టించేట‌ప్పుడు ఇబ్బంది ప‌డ్డారా?
నేను 150 కేజీల బ‌రువు వుండ‌గానే డాన్స్‌లు వేశాను. న‌టుడిగా త‌ప‌న‌తో వ‌చ్చాను కాబ‌ట్టి పెద్ద‌గా క‌ష్టం అనిపించ‌లేదు. అయినా న‌టుడికి పిట్‌నెస్ ముఖ్య‌మ‌ని తెలుసుకున్నా. దేనికైనా ఆరోగ్యం బాగుండాల‌ని గ్ర‌హించాను. హీరోలంతా ఫిట్‌నెస్ అంటుంటారు అనేది ఎందుకో నాకు అప్ప‌డు అర్థ‌మ‌యింది.
లాక్‌డౌన్‌లో ఏం చేశారు?
నేను ఫుడ్ ప్రియుడ్ని. వంట బాగా చేస్తా. రోజూ తినేదికాకుండా చైనీస్‌, ఇటాలియ‌న్ పుడ్‌ను త‌యారుచేసుకుంటాను. నాకు ఆ ఫుడ్ అంటేనే ఇష్టం.
మీ అమ్మాయి కూడా న‌టిగా న‌టిస్తుందా?
అవును. త‌ను ఇంకా చ‌దువుకుంటుంది. సోష‌ల్‌మీడియాలో ఫొటోలు చూసి మ‌నం ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ బాల న‌టిగా అడిగారు. `థ్యాంక్యూ` సినిమాలో న‌టిస్తోంది.
 
రాజుల కుటుంబంలోనుంచి వ‌చ్చిన మీరు న‌టుడిగా ఎందుకు మారాల‌నిపించింది?
నాకు చిన్న‌త‌నం నుంచి న‌టన అంటే ఇష్టం. వైజాగ్‌లో స్కూల్‌డేస్‌లో రామాయ‌ణంలో రాముడి పాత్ర వేశాను. స్కూల్ అంతా మెచ్చుకున్నారు. అక్క‌డి నుంచి నా ఆలోచ‌న మారిపోయింది. షూటింగ్ ప‌నిమీద వ‌చ్చిన‌ప్పుడు ఎన్‌.టి.ఆర్‌.గారు మూడుసార్లు మా ఇంటికి వ‌చ్చారు. నేను లావు అనే ఫీల్ నాకు అనిపించ‌లేదు. న‌టుడిగా ఎలాగైనా చేయాల‌నే కోరిక వుండేది.
న‌ట‌న ఎక్క‌డ‌నేర్చుకున్నారు?
మ‌ధు ఫిలిం  ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నా. దేవ‌దాస్ క‌న‌కాల‌, రాజీవ్ క‌న‌కాల‌. ల‌క్ష్మీ మేడం మెళకువలు చెప్పేవారు. అదే నాకు కాన్‌ఫిడెన్స్ పెంచింది.
తొలి సినిమా ఏది చేశారు?
నేను ముంబైలో కొంత‌కాలం వున్నాను. అప్ప‌టికి షార్ట్ ఫిలింస్ అనేవి పెద్ద‌గా ఎవరికీ తెలీవు. అలాంటి టైంలో ఒక షాట్ ఫిలిం చేశాను. అది చూసిన ప్రియ‌ద‌ర్శిరామ్ గారు తాను తీస్తున్న `మ‌నోడు` సినిమాలో చాన్స్ ఇచ్చారు. 
మీ డ్రీమ్ రోల్స్ వున్నాయా?
న‌టుడిగా డ్రీమ్ రోల్స్ వుంటాయి. కానీ అది అంద‌రికీ సాధ్య‌ప‌డ‌దు. సొంత‌గా నిర్మాణం చేసుకుంటేనే అది సాధ్య‌ప‌డుతుంది. క‌మ‌ల్‌హాస‌న్ స్వంత‌గా ద‌శావ‌తారం చేశాడు. అందులో ఆయ‌న డ్రీమ్ రోల్స్ అన్నీ చేసేశారు. అలాగే నాకు శేక‌ర్‌క‌మ్ముల‌, గౌత‌మ్మీన‌న్ వంటివారి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌నేది నా డ్రీమ్‌. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు