అసలు ఏం జరిగిందంటే.. ఒత్తిడిని జయించడం ఎలా.. అన్న విషయంపై ఓ సదస్సు ముంబాయిలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించడంతో పాటు రకరకాల సూచనలు, సలహాలు కూడా ఇచ్చారట దీపికా. అయితే ఓ విలేకరి రణవీర్‌తో మీ పెళ్ళి ఎప్పుడు అని అడిగాడట. దాంతో దీపికాకు చాలా కోపం వచ్చి.. ఎప్పుడు ఏం అడగాలని కూడా తెలియదా.. ఇటువంటి కార్యక్రమంలో ఈ ప్రశ్నను ఎలా అడగాలని అనిపించిందంటూ బాగా దులిపేసిందట.