భర్త చనిపోయాడు.. కొడుకు కాదన్నాడు.. కూతుళ్లు తల్లికి పెళ్లి చేశారు

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (16:12 IST)
తల్లికి కుమార్తెలు వివాహం చేసిపెట్టారు. భర్తలేని తల్లికి తోడు కల్పించారు. భర్త చనిపోయినా తన బిడ్డల్ని పెంచి పెద్ద చేసింది. తీరా కొడుకు ఎదిగాక.. కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో అనాథగా మారిన ఆ తల్లికి కూతుళ్లు అండగా నిలిచారు. తన తల్లికి మరోసారి వివాహం చేసి కొత్త జీవితాన్ని అందజేశారు. ఈ సంఘటన మీరట్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మీరట్‌లోని జాగృతి విహార్‌కు చెందిన ఓ మహిళకు భర్త చనిపోయి... 15 సంవత్సరాలైంది. అయినా  బిడ్డల కోసం బతికింది. తన కాయకష్టంతో పిల్లలను పెంచి పెద్ద చేసింది. కుమార్తెలకు ఘనంగా వివాహం జరిపించింది. 
 
అయితే కొడుకు చెడు అలవాట్లకు లోనయ్యాడు. తల్లిని కొడుతుండేవాడు. ఒకరోజు కన్నతల్లిని బయటకు గెంటేశాడు. దీంతో ఆమె కుమార్తెలే ఆమెకు ఆశ్రయం కల్పించారు. తర్వాత వారు తల్లికి మంచి వరుడిని వెదికి పెళ్లి చేశారు. సుహారన్‌పూర్ నివాసి, వారి బంధువు అయిన వ్యక్తితో తల్లికి వివాహం జరిపించారు. ఆయనకు పెళ్లయినప్పటికీ భార్య చనిపోవడంతో ఈ వివాహానికి అంగీకరించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు