Mahesh Babu, Trivikram, Thaman, Nagavanshi
పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేశాడు మహేష్‌బాబు. ఆ తరువాత రాజమౌళితో మహేష్ సినిమా మొదలవుతుంది. తాజాగా మహేష్- త్రివిక్రమ్ తో సినిమా ప్రారంభమైంది. అతడు, ఖలేజా తరువాత మూడో సినిమా రాబోతుంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ దర్శకుడిగా మహేశ్28 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన వార్త పంచుకున్నాడు.