జెకోస్లావియాలోని ఫ్రాగ్‌లో రీ-రికార్డింగ్ జరుపుకుంటున్న "శక్తి"

గురువారం, 10 మార్చి 2011 (17:05 IST)
WD
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా వైజయంతీ మూవీస్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న భారీ చిత్రం శక్తి. తెలుగు సినిమా చరిత్రలో హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న శక్తి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా జెకోస్లావియాలోని ఫ్రాగ్‌లో రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా సి.అశ్వనీదత్ మాట్లాడుతూ... మా శక్తి సినిమా షూటింగ్ టోటల్‌గా పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం రీ-రికార్డింగ్ జెకోస్లావియాలో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని మార్చి 30న అత్యధిక ప్రింట్స్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నాం.

ఇటీవల విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. సినిమా విడుదలకు ముందే ఆడియో సంచలనం సృష్టిస్తోంది. డెఫినెట్‌గా సినిమా కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని, మెహర్ రమేష్ దర్శకత్వ ప్రతిభను శక్తిలో ప్రేక్షకులు చూస్తున్నారు అన్నారు.

ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా, మంజరి, ఎస్పీబీ తదితరులు నటిస్తున్నారు. నిర్మాత: సి. అశ్వనీదత్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మెహర్ రమేష్.

వెబ్దునియా పై చదవండి