ప్రతి శుక్రవారం సినిమా ఇండస్ట్రీకి పరీక్షలాగే ఈ శుక్రవారం ఎన్.టి.ఆర్. జూనియర్‌కు పరీక్ష. దమ్ముతో ముందుకు వచ్చాడు. ఆది నుంచి తన దమ్మును గుండెల్లో నింపుకుని దమ్మంతా ఒక్కసారిగా బయటకు పెట్టాడు. గతంలో బోయపాటి శ్రీను దీసిన 'సింహా' చిత్రాల, 'సింహాద్రి' ఛాయలు కలగలిపి పూర్తి యాక్షన్ (హింస) చిత్రాన్ని తీశాడు. కథలోకి వెళితే..
రాజుల వంశానికి చెందిన రెండు గ్రామాలు. ఒక్కో వంశం కింద 40 గ్రామాలుంటాయి. ఇద్దరికి వైరం. అహంతో జనాల్ని చంపేస్తూ... ఊరిలో తన జెండానే ఎగరాలనుకునే వర్గం చరణ్‌రాజ్‌ది. పదిమందికి బాగుపడాలనేది సుమన్ వర్గం. వీరి వైరం పది తరాల నుంచి వస్తూంటుంది. దీన్ని అరికట్టడానికి వీరిద్దరికి తెలిసిన ఎం.పి. (రంగనాథ్) సంక్రాతికి వచ్చే పల్లాలమ్మజాతరనాడు రెండురోజులు మాత్రమే తాంబూలాలు ఇచ్చుకుంటూ పగలు, ప్రతీకారాలు తీర్చుకోవాలని తీర్పు చెబుతాడు. దాన్ని ఇరువర్గాలు ఆచరిస్తారు. సుమన్ వంశంలో అందరూ ఆడపిల్లలే.
ఆ తర్వాత పట్టణంలో ఓ అనాధగా ఎన్.టి.ఆర్. పెరుగుతాడు. చంపడం అంటే సహించడు. పదిమంది బతకాలని కోరుకునరే వ్యక్తి. పెండ్లిచేసుకొని హాయిగా బతకాలంటే 50 లక్షలు కూడబెడతాడు. అలాంటి వ్యక్తి త్రిషను చూసి ప్రేమలో పడిపోతాడు. త్రిష కోటీశ్వరాలి కుమార్తె. ఓ సందర్భంలో వాసిరెడ్డి వంశానికి చెందిన రాజులు మగపిల్లాడులేడని దత్తత కోసం వెతుకుంటే ఎన్.టి.ఆర్. వెళతాడు.
అలా దత్తతకు వెళ్లి ఆ ఇంటిలో కక్షలు, హత్యలు చేయాల్సిన బాధ్యత తనపై పడిందని తెలుసుకుంటాడు. ఎప్పటికప్పుడు తప్పించుకోవాలను చూస్తున్నా.... పరిస్థితులు అనుకూలించక చివరికి కత్తులతో రక్తపాతం సృష్టించాల్సి వస్తుంది. ఆ రక్తపాతంలో తనేం సాధించాడు? త్రిష, కార్తీక పాత్రలే ఏమిటి? అన్నది సినిమా.
కథలో కొత్తదనం ఏమంటే... తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటే చావుకు సిద్ధం అయినట్లే... హింసాత్మకమైన ఈ లాజిక్కుతో ఎన్.టి.ఆర్. అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. కుటుంబంతో కలిసి చూడాలంటే గుండెలో దమ్మునింపుకుని చూడాలి. ప్రతి క్షణం నరుక్కోవడం, పొడుచుకోవడం, తలలు ఎగిసిపడడం... వంటివి కంటికి ఇంపుగా అనిపిస్తాయి. బాలకృష్ణకు ఎక్కువ, ఎన్.టి.ఆర్.కు తక్కువగా ఈ కథను దర్శకుడు ఎంచుకున్నాడు. సినిమా అంటే కేవలం వినోదమేకాదు హింసకూడా వినోదంగా చూడాలని చెప్పే ప్రయత్నమే ఈసినిమా.
File
FILE
అభినయం ఎన్.టి.ఆర్.జూనియర్ అభినయం కథాపరంగా సరిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ, రాజా వంశానికి చెందిన వ్యక్తిగా మీసకట్టు కుదిరింది. తల్లిసెంటిమెంట్‌ను బాగా పండించాడు. గతంలో రెండు చిత్రాల్లో నిరాశపర్చినా ఇందులో సెంటిమెంట్ బాగా కుదిరింది. యాక్షన్ ఎపిసోడ్ మాత్రం ఇంతవరకు ఎన్.టి.ఆర్. బాలయ్య చిత్రాల్లో లేనంతగా ఉంది. త్రిష, కార్తీక పాత్రలు వరసకు బావగా 'నన్ను ఉపయోగించుకోండి', నన్ను యూస్ చేసుకోండంటూ.. ఇద్దరూ ఎన్.టి.ఆర్. చుట్టు తిరగడం మాస్‌ను ఆకట్టుకోవడమే.
బ్రహ్మానందం పాత్ర హాస్యాన్ని పెద్దగా వినియోగించుకోలేక పోయాడు. హీరో స్నేహితునిగా అలీపాత్ర ఉన్నమేరకు కామెడీ పండించినా సీరియస్ కథకు ఇది ఏమాత్రం సరిపోదు. మిగిలిన పాత్రలన్నీ సన్నివేశపరంగా వచ్చి వెళ్లేవే. కథంగా హీరో చుట్టూనే తిరుగుతుంది. హీరో లేని సన్నివేశం చాలా తక్కువ.
సాంకేతికత రత్నం సంభాషణలు కొన్నిచోట్ల బాగున్నాయి. చావు గురించి చెప్పే డైలాగ్స్‌లో వేదాంతం ఉన్నా.. లాజిక్కు ఉంది. రాజకీయాల్లోకి రావాలంటే.. నన్ను జనాలు కోరుకుంటే వస్తాను కానీ ఎవరురమ్మంటే రాననీ డైలాగ్స్‌లు... టీడీపీకి తగిలేలా ఉన్నాయి. కెమెరా పనితనం కష్టంతోకూడుకుంది. అయినా బాగానే చేవాడు. కీరవాణి బాణీలు వినసొంపుగా ఉన్నాయి. సాహిత్యంలో ద్వందార్థాలున్నాయి. 'వాస్తు బాగుందే..' అంటూ అదరాలను తెలియజెప్పేట్లుగా ఉంది. 'రూరల్ అనే పాట.. తన కోరికను నెరవేర్చుకునేట్లుగా రాసుకున్నాడు. 'దమ్ము' అంటూ సాగే టైటిల్‌సాంగ్ సన్నివేశపరంగా అనిపించదు.
మొదటి భాగమంతా సరదాగా సాగినా... కథంతా సెకండాఫ్‌లో ఉంటుంది. త్రిష, కార్తీక పాత్రలు కేవలం పాటలకే పరిమితం. హీరో వేణు ఇందులో ఎన్.టి.ఆర్. బావగా నటించాడు. ఊరి కోసం హీరో ఏం చేశాడు? అన్న పాయింట్‌తో చాలా చిత్రాలూ వచ్చాయి. అయితే హింస ఎక్కువగా చూపిస్తూ.... దాన్ని వినోదంగా కన్వీనెన్స్‌చేస్తూ.... అభిమానులు, మాస్ ప్రేక్షకులు చూస్తారని నమ్మి ఎన్.టి.ఆర్., బోయపాటి శ్రీను తీసిన ఈ సినిమా చూడాలటే నిజంగానే దమ్ముకావాలి. ఇది ఓ మోస్తరు సినిమా మాత్రమే. ఇంతకంటే ఈ చిత్రం గురించి రాయడమూ దండగే.