భార్యకు నా గడ్డం నచ్చలేదు... తమ్ముడు క్లీన్ షేవ్ నచ్చింది.. అందుకే లేచిపోయింది... భార్య బాధితుడు

ఠాగూర్

గురువారం, 1 మే 2025 (15:11 IST)
తన భార్యకు తనకున్న గడ్డం నచ్చలేదని, అందుకే ప్రతిరోజూ క్లీన్ షేవ్ చేసుకునే తన తమ్ముడుతో లేచిపోయిందని మీరట్‌కు చెందిన ఓ భార్యా బాధితుడు చెప్పుకొచ్చాడు. యూపీలోని మీరట్‌ లిసాడి గేట్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత.. తన భర్తకు పొడవాటి గడ్డం వెంట్రుకలు ఉండటం నచ్చలేదు. దీంతో ఆమె మరిదితో లేచిపోయింది. దీనిపై బాధిత భర్త కలత చెందిన పోలీసుల సాయం కోరాడు. 
 
ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మొదటి నుంచే తాను గడ్డాన్ని పెంచుకున్నాని, అయితే తన భార్య గడ్డం తీయాలని ఒత్తిడి చేసినప్పటికి తాను అంగీకరించలేదన్నారు. పైగా, అలాగే, ఉంచుతానన భార్య అర్షికి భర్త మౌలానా షకీర్ తేల్చి చెప్పాడు. 
 
అదేసమయంలో తన సోదరుడు షకీర్ ప్రతి రోజూ క్లీన్ షేవ్ చేసేవాడని, ఈ క్రమంలో తాను ఇంట్లో లేని సమయంలో తన సోదరుడు, తన భార్యకు మధ్య సాన్నిహిత్యం ఏర్పడివుంటుందని, అందుకే తనను వదిలివేసి సోదరుడుతో పారిపోయిందని షకీర్ ఆరోపించారు. తన భార్య చేష్టల గురించి అత్తమామలను కూడా తెలియజేశానని, వారు తమకెలాంటి సంబంధం లేదని చెప్పారని, అందువల్లే పోలీసుల సాయాన్ని కోరాల్సి వచ్చిందన్నారు. అదేసమయంలో తన భార్య తన సోదరుడుతో లేచిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు