భూమిక, స్నేహాల "అమరావతి" సినిమా ట్రైలర్

సెక్సీతారలు భూమికా చావ్లా, స్నేహలు ప్రధాన పాత్రలో, నందమూరి తారకరత్న విలన్‌గా నటిస్తోన్న చిత్రం "అమరావతి". గతంలో శౌర్యం చిత్రాన్ని నిర్మించిన ఆనందప్రసాద్ తాజాగా ఈ హార్రర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, స్నేహ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.

హారర్, సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత రవి తెలియజేశారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా చిత్రాలను తీసే రవిబాబు కథ చెప్పగానే ఆనంద్ ప్రసాద్ ముందుకు వచ్చారు. ప్రేమ, యాక్షన్ అంశాలున్నా అవి కథాగమనంలో ఆసక్తికరంగా సాగుతాయన్నారు.

మెడికో విద్యార్థులు ఓ పరిశోధన నిమిత్తం తలకోన అటవీ ప్రాంతాలలోకి వెళితే... అక్కడ జరిగే సంఘటలేమిటనేదే ఈ చిత్రమని సమాచారం. ఇందులో విశేషమేమిటంటే...? నందమూరి హీరోగా 9 చిత్రాలను ఏక కాలంలో ప్రారంభించి సక్సెస్ కొట్టలేకపోయిన నందమూరి తారకరత్న విలన్‌గా నటించడమే..! విలన్ పాత్రల ద్వారానైనా తారకరత్నకు గుర్తింపు రావాలని ఆకాంక్షిస్తూ.. "అమరావతి" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూద్దామా..?

వెబ్దునియా పై చదవండి