Miyai cutouts at Prasad Imax
ట్రైలర్ పరంగా చూస్తే, అశోకుని కాలంలో 9 శక్తివంతమైన గ్రంథాలు వాటి కోసం వెతికే విలన్ వాటిని అతడికి చిక్కకుండా చేసేందుకు పోరాటం చేసే హీరో ఈ మధ్యలో సాలిడ్ యాక్షన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ గగుర్పాటు కలిగిస్తాయి. వింతగా అనిపిస్తాయి. ఇందులో విలన్ గా మనోజ్ పాత్ర హైలైట్ గా వుంటుంది. దీనిపై తేజ మాట్లాడుతూ, మా వయస్సులో వున్న వాళ్ళమంతా మనోజ్ చిత్రాలు చూసేవాళ్ళం. తనలో అద్భుతమైన టాలెంట్ వుంది. ఈ సినిమాలో పాత్ర చాలా బాగుంటుంది. మా సినిమాలో పనిచేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు.