పైగా, విడుదల తేదీకి సమయం చాలా తక్కువగా ఉండటంతో ప్రమోషన్ల వేగం పెంచారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. లవ్.. రొమాన్స్.. ఎమోషన్‌తో కూడిన ఈ ట్రైలర్‌ను ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.
టైటిల్‌కి తగినట్టుగానే ఈ సినిమా రొమాంటిక్‌గా ఉండనుందనే విషయం, ఈ ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. రమ్యకృష్ణ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తోంది. ''చాలామంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ .. కానీ వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు" అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.