ఎడారిప్రాంతంలో వుండే చోట గుర్రాలతో కొందరు ప్రయాణిస్తుంటారు. ఓ వాయిస్ ఓవర్ తో ఈ కథ వెలుగు పంచే దేవుళ్ళది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రాముడిది కాదు. ఈ కథ. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్ని వణికించే మహారాజుది. డాకు మహారాజ్.. అంటూ వస్తుంది. ముసుగువేసుకున్న బాలక్రిష్ణ గెటప్ కొద్దిగా రిలీవ్ అవుతుంది. కత్తులతో యుద్దం చేసే సీన్స్ కనిపిస్తాయి. సో. ఇది పూర్తి మాస్ చిత్రంగా అనిపిస్తుంది. థమన్ నేపథ్యం తగినట్లుగా వుంది.
ఈ చిత్రం సంక్రాంతికి 12వ తేదీన విడుదలకానుంది. సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. బాలక్రిష్ణ ఇమేజ్ ను ద్రుష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చేనెలలో ట్రైలర్ విడుదలకానున్నదని చిత్ర యూనిట్ ప్రకటించింది.