ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ : వేదాల శ్రీనివాస్ గారు నిర్మాతగా శంకర్ దర్శకుడిగా చేస్తూ కన్నడ సినిమాగా తీసి తెలుగులో వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో మన తెలుగువారు నాగబాబు గారు, మధుసూదన్ గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు నటించడం ఇది ఒక తెలుగు సినిమాలాగే అనిపిస్తోంది. యమధీర టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. యమ గతంలో మన యమదొంగ, యమలీల, యమగోల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి అదేవిధంగా ధీర మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. కోమల్ కుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ గా చాలా అద్భుతంగా నటించాడు. మొత్తం అంతా కూడా ఫారిన్ లొకేషన్స్ లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. గతంలో విజయ్ సర్కార్ మూవీ లాగే ఇది కూడా పొలిటికల్ డ్రామా. ఈవీఎం ల ట్యాంపరింగ్, పోలింగ్ వాటి గురించి చాలా బాగా చూపించారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా టెక్నికల్ వాల్యూస్ తో ఈ యమధీర సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. వేదాల శ్రీనివాస్ గారు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఈ జనరేషన్ కి కొత్త అవకాశాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.