బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి తిరుమల వెంకన్న సరస్వతి రూపంలో విహరించారు. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ హంసవాహనంలో తిరిగారు. మంచి గుణం, విద్య మనిషికి ఎంత అవసరమో, లేనివారికి విజ్ఞానాన్ని అందించే సరస్వతి రూపంలో మలయప్ప స్వామిగా భక్తులను ఆశీర్వదించారు. ఈ రూపంలో స్వామిని కొలిచేందుకు భక్తులు దేశవిదేశాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు.