ఈ ఘటనపై ఆ బాలిక తల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, నిందితులనైనా ఉరి తీయండి.. లేదంటే మమ్మల్ని కాల్చి చంపండి అని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. వాళ్లను వదిలేస్తే మమ్మల్ని ఎలాగూ చంపుతారు. నాలుగు గ్రామాల ప్రజలు ఇప్పుడు మా వెంట పడుతున్నారు. మేం కేవలం నలుగురం ఉన్నాం. అన్నీ కోల్పోయాం. మా ఇల్లు, ఆస్తి పోయింది అని ఆమె చెప్పింది.
అంతేకాకుండా, సీబీఐ విచారణకు అంగీకరించాలని స్థానిక నేతలు తమపై ఒత్తిడి తెస్తునారని బాలిక తల్లి వెల్లడించింది. అయితే బాలిక కుటుంబం మాత్రం రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులే విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. నిందితులను కాపాడటం కోసమే స్థానిక నేతలు సీబీఐ విచారణ కోసం పట్టుబడుతున్నారని బాలిక తల్లి ఆరోపించింది.