కొందరు బీజేపీ నేతలు నోటి దురుసుగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు చేతికి కూడా పనిచెప్తారని నిరూపించారు సోనాలీ ఫోగట్. టిక్‌టాక్‌లో ఫేమస్ అయి, బీజేపీ లీడర్‌గా మారిన హర్యానాకు చెందిన సోనాలీ ఫోగట్ మరోసారి వార్తల్లో నిలిచారు. శుక్రవారం అగ్రికల్చర్ మార్కెట్‌కు వెళ్లిన ఆమె అక్కడ రైతులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు.