#BabaRamdev ఏనుగు మీద యోగా గురువు, బిళ్లబీటున కింద పడ్డాడు- video

మంగళవారం, 13 అక్టోబరు 2020 (23:04 IST)
ఏ పనైనా ఎప్పటిలా మామూలుగా చేస్తే ఏముంటుంది? అసలే డిజిటల్ కాలం. ఏదో వెరైటీ చేస్తేనే ఏదైనా జనంలోకి దూసుకుని వెళుతుంది. బాబా రామ్‌దేవ్ కూడా అదే చేసారు. ఆయన ఇప్పుడు కాదు... ఎప్పటి నుంచి యోగాతో కొత్త ప్రయోగాలు చేస్తూ కుస్తీలు పడుతూనే వున్నారు.

అందులో భాగంగా మధురలో, బాబా రామ్‌దేవ్ ఏనుగుపై కూర్చొని యోగా చేస్తున్నాడు, కానీ ఏనుగుకి ఆ యోగాలో తేడా అనిపించిందో లేక దానికి వీపు మీద ఏదైనా కుట్టిందో ఇంకేమైనా జరిగిందో కానీ ఒక్కసారిగా అటుఇటూ కదలింది. అంతే... యోగా బాబా రాందేవ్ బ్యాలెన్స్ కోల్పోయి ఏనుగు పైనుంచి బిళ్లబీటున కిందపడ్డాడు. ఇప్పుడీ వీడియో సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది.
 

Baba Ramdev had said Corruption will fall if Narendra Modi becomes PM pic.twitter.com/qauXNgISqG

— Joy (@Joydas) October 13, 2020
విషాద కర్షని రామనారతి ఆశ్రమ మహావన్ వద్ద బాబా యోగా చేస్తున్నాడు. ఈ సమయంలో, బాబా రామ్‌దేవ్ ఏనుగుపై కూర్చుని యోగా కూడా చేశాడు. రెండు-మూడు నిమిషాల తర్వాత ఏనుగు కదిలినప్పుడే బాబా రామ్‌దేవ్ యోగ ప్రదర్శన ప్రారంభించాడు.
 
ఏనుగు పైనుంచి బాబా రాందేవ్ కిందపడటంతో అక్కడివారంతా భయపడ్డారు. కాని బాబా త్వరగా లేచాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా ఎగతాళి చేస్తున్నారు. బాబా రామ్‌దేవ్‌పై ప్రజలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి ముందే, టీవీ ఛానల్ కార్యక్రమంలో సైకిల్ నడుపుతున్నప్పుడు బాబా రామ్‌దేవ్ పడిపోయాడు. అప్పుడు సైకిల్ పైనుంచి పడ్డారు ఇప్పుడు ఏనుగు అంటూ కామెంట్లు జోడిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు