కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. మహిళ చేతిలోని మైక్ లాక్కొనే క్రమంలో చున్నీని లాగాడు. ఆమె భుజాన్ని నొక్కి బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓ సభ జరిగింది. ఇందులో సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు. అక్కడ ఓ మహిళ ముందు వరుసలో నాయకుల ఎదుట నిల్చుని తమ సమస్యల గురించి చెబుతోంది. ఆమె మాటలకు ఆవేశంతో సిద్ధరామయ్య మైక్ లాక్కున్నారు.