దినకరన్ సింగిల్ సీటు సాధించలేకపోయాడు, విచిత్రం ఏంటంటే, గత దశాబ్ద కాలం తర్వాత బిజెపి 4 సీట్లు గెలిచింది. డిఎంకె, ఎఐఎడిఎంకె నేతృత్వంలోని రెండు ప్రత్యర్థి కూటముల పోటీతో దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్రా కగం (ఎఎంఎంకె) పార్టీ కనుమరుగైపోయింది.
పార్టీ వ్యవస్థాపకుడు టిటివి దినకరన్ కూడా ఓడిపోయారు. కోవిల్పట్టి నియోజకవర్గం నుండి ఎంతో ఆర్భాటంగా పోటీ చేసినా అక్కడ ఆయనను ఓటర్లు తిరస్కరించారు. ఆదివారం ప్రకటించిన ఫలితాలు దినకరన్ భవిష్యత్ రాజకీయ ఆశయాలకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచాయి. ఇక ఈ దెబ్బతో అటు శశికళ, ఇటు దినకరన్ రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతారో లేదంటే అన్నాడీఎంకెలో చేరుతారో చూడాల్సి వుంది.