మరోసారి వర్కవుట్ అయిన PK ఫార్ములా, ఆధిక్యంలో దీదీ- కోయంబత్తూరులో కమల్ ముందంజ

ఆదివారం, 2 మే 2021 (13:39 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(PK) ఫార్ములా మరోసారి వర్కవుట్ అయినట్లే కనిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 203 స్థానాలలో భారీ ఆధిక్యంతో దూసుకువెళుతోంది. ఉదయం నుంచి నందిగ్రాం నియోజకవర్గంలో వెనకబడిపోయిన మమతా బెనర్జీ ఆరు రౌండ్ల తర్వాత 1427 ఓట్ల ఆధిక్యంతో వున్నారు. దీనితో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
 
ఇదిలావుంటే తమిళనాడులో డిఎంకే స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళ్తోంది. ఆ రాష్ట్రంలో టార్చ్ లైట్ గుర్తుతో మక్కల్ నీతిమయ్యం అనే పార్టీతో ముందుకు వచ్చిన విలక్షణ నటుడు కమల్ హాసన్ పోటీ చేసిన కోయంబత్తూరులో ముందంజలో వున్నారు. ఆయన తప్ప రాష్ట్రంలో ఎవ్వరూ ఆధిక్యంలో లేరు. 7వ రౌండ్ ముగిసే సమయానికి కమల్ హాసన్ - 15,246 ఓట్లతో ముందంజలో వుండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మయూర 12,531 ఓట్లు, భాజపా అభ్యర్థి వానతి 11,197 ఓట్ల ఆధిక్యంతో వున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు