2. ఇంటికి పడమరయందు ఎక్కువ ఖాళీ స్థలముండి తూర్పున తక్కువ ఖాళీస్థలమున్న యోడల ఆ ఇంట మగసంతతి లేకుండుట లేక తక్కువుగా యుండుట, ఆడసంతానమెక్కువగా ఉండుట, ఆర్ధిక దుస్థితి అనారోగ్యం, సంతానమున కరిష్టములు ఆడపెత్తనము మొదలగునవి సంభవించును.
3. పడమర భాగము మెరకగానున్న కీర్తిప్రతిష్టలు, ధనధాన్యాభివృద్ధి, సంతాన సౌఖ్యం, ఆరోగ్యపుష్టి, సత్ప్రవర్తన, మానసిక ప్రశాంతత దాంపత్య సౌఖ్యము వ్యవహర విజయము మొదలగు శుభములు కలుగును.
4. ఇంటికిగాని, ఖాళీస్థలమునకు గాని, దక్షిణ పడమర దిశలయందున్న స్థలములుగాని, గృహములుగాని, కొని కలుపుకొనుట అశుభప్రదము దానివలన ఆర్థిక స్థితి క్రమముగా క్షీణించును. ధననష్టము మితముగా వుండును. ఒక్కొక్కప్పుడు ప్రాణనష్టము కూడా సంభవించును. ముఖ్యముగా దక్షిణమువైపు స్థలము కొని కలుపుకొనుట మహా దోషము.
5. పడమర భాగము యొక్క ప్రభావం ముఖ్యముగా ఆ ఇంటి పురుషుల పైన మగ సంతతిపైన ముఖ్యముగా ప్రధమ సంతతిపై కీర్తి ప్రతిష్టలపై ఆర్థిక పరిస్థితిమీద చూపును.
6. ఇంటికి పడమర వైపు తక్కువఖాళీ స్థలముండిన శుభం. ఆర్ధికపుష్టి, ఆరోగ్యపుష్టి, సంతానమునకు, కుటుంబమునకు సౌఖ్యము. వ్యవహార విజయము, కీర్తిప్రతిష్ఠలు మొదలగు శుభములు కలుగును.
7. ఇంటికి తూర్పువైపున కంటె పడమర మెరకగానున్న శుభప్రదము. పైన చెప్పిన శుభఫలితములు కూడా కలుగును.
8. పడమర భాగమందు బావియుండుట దోష ప్రదము.
9. ఇంటియోక్క పడమటి - సగభాగములో పై అంతస్తు వేసిన యింటికి వాస్తుబలము కలిగి ఆ ఇంటియందుండువారికి శుభము కలుగును. యింటి యజమాని చేయు పనిలో త్వరత్వరగా అభివృద్ధి కలుగును. సుఖసంతోషములు కీర్తి ప్రతిష్టలు ఆర్దికపుష్టి కలుగును.