అనేక మంది ఇంట్లో అన్ని విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. పడక గది, వంటిల్లు, హాలు నిర్మాణాల్లో వాస్తుపరంగా ఆలోచన చేస్తారు. కానీ, పూజ గది విషయంలో మాత్రం అంతగా పట్టించుకోరు. కొందరు ప్రత్యేకంగా పూజ గదిని నిర్మించుకుంటే, మరికొందరు మాత్రం కిచెన్‌లోనే ఓ పక్క అల్మారానే పూజకు కేటాయిస్తారు.
* ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నపుడో, కష్టాల్లో ఉన్నపుడో దైవుడుని ఆశ్రయిస్తారు. అలాంటి సమయంలో దేవుడు గదిలో ఎక్కువ విగ్రహాలు ఉండటం వల్ల ఏకాగ్రత కుదరకపోవడంతో ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల పూజ గదిలో పరిమిత సంఖ్యలోనే విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. అంటే పూజ గదిలో ఎక్కువ విగ్రహాలు లేకుండా చూడాలి.
* పూజ గదిలో నలుపు, బూడిద, నీలం రంగులను వాడొద్దు. ఇవి డిప్రెషన్, నిరాశకు కారణమైన వైబ్రేషన్‌ను కలిగిస్తాయి.