*కొందరిలో అలసట, నిద్రలేమి వల్ల కళ్ల కింద చర్మం ఉబ్బుతుంది. దీన్ని తగ్గించాలంటే కప్పు గోరువెచ్చటి నీటిలో అరచెంచా ఉప్పు కలపాలి. ఈ నీటిలో శుభ్రమైన నూలు వస్త్రాన్ని కాసేపు ఉంచాలి. దాంతో కళ్ల అడుగున మృదువుగా అద్దినట్లు చేస్తే ఆ వాపు తగ్గుతుంది.
*బూట్లలో రాత్రిపూట కొద్దిగా ఉప్పు చల్లి చూడండి. వాటి నుంచి దుర్వాసన రాదు.
*చేపల తొట్టెను శుభ్రం చేయడానికి కూడా ఉప్పు కలిపిన వేడి నీటిని ఉపయోగిస్తే, దుర్వాసన సమస్య ఉండదు.
*కొత్త తువాళ్లు రంగు పోకుండా ఉండాలంటే, మొదటిసారి ఉతికేటప్పుడు ఉప్పు నీటిలో కసేపు నానబెడితే చాలు, రంగు పోదు.