బాలింతలు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి. అంతే కాదు గర్భాశయం త్వరగా కుంచించుకుంటుంది. గర్భాశయంలో నొప్పి తగ్గుతుంది. బొప్పాయి దోరగా ఉన్నదాన్ని కొబ్బరి కోరులా చేసి కూర వండుకుని తింటే స్తన్య వృద్ధి కలుగుతుంది. తన పాలు దోషయుక్తంగా ఉండి బిడ్డకు వికారం, విరేచనాలు కల్గిస్తున్నప్పుడు, బొప్పాయి కాయను గానీ పండుని గానీ తీసుకోవడం మంచిది.
బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వేడిచేసి రొమ్ములకు కడితే పాలచేపు వస్తుంది. పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి. ఆవుపాలు, కర్బూజా పండు, పాలకూర, జీలకర్ర, బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, ములగాకు కూరలు చాలా మేలు చేస్తాయి.