ఖర్జూర పండ్లు తిని వేడి నీళ్లు తాగితే నడుము నొప్పి తగ్గుతుందా? (video)

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (15:52 IST)
రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా? వెన్నునొప్పితో బాధపడుతున్నారా? ఒక గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లైతే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 
 
ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే నడుము నొప్పి తగ్గుతుందట. నల్లమందు, రసకర్పూరం కొబ్బరినూనెలో కలిపి రాసినట్లైతే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే శొంఠి, గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే ఆహారంలో టమోటాలు చేర్చుకోవాలి. అలాగే పాలు, చీజ్, పెరుగును చేర్చుకోవాలి. కానీ ఫాస్ట్‌పుడ్‌ను పక్కనబెట్టాలి. పాస్తా, షుగర్ యాడ్స్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకపోవడం మంచిది. ఇంకా డైట్‌లో క్యారెట్లు, బీట్ ర‌ూట్, స్పీట్ పొటాటోస్, చెర్రీస్, బెర్రీస్, ద్రాక్షలు, దానిమ్మ, పుచ్చకాయలను తీసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను రోజువారీ డైట్‌లో తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు