స్థల వివాదం వల్లే పండును హత్య చేశా..!: మహీందర్ రెడ్డి

విశాఖపట్నంలోని స్థల వివాదం వల్లే తెదేపా నేత చలసాని పండును హత్యచేశానని మహీందర్ రెడ్డి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. స్థల వివాదంలో పండును తనను మోసం చేశాడని, అందుకే చలసాని చంపేశానని మహీందర్ రెడ్డి వెల్లడించాడు.

హైదరాబాద్‌లోని మధురానగర్‌లో దారుణ హత్యకు గురైన చలసాని పండు హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న మహేందర్‌రెడ్డిని బుధవారం తెల్లవారుజామున గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

గుల్బర్గాలో అదుపులోకి తీసుకున్న మహీందర్ రెడ్డి వద్ద పోలీసులు విచారణ జరపగా, పండును హత్య చేసిన నేరాన్ని అంగీకరించినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో మహీందర్ రెడ్డిని మీడియా ముందు హాజరు పరచనున్నారు.

వెబ్దునియా పై చదవండి